ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశలేదు. కొందరు కేటుగాళ్ళ కారణంగా అన్నదాతలకు అగచాట్లు తప్పడంలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాలపై నకిలీ విత్తనాలు పంజా విసురుతున్నాయి. అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టేశారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచివస్తున్నాయో తెలీడం లేదు. ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల…