Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ కు సర్వం సన్నద్ధమైంది. ప్రతీ సంవత్సరం నీట్ ర్యాంకు ద్వారా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్, ఏహెచ్ సీట్లతో పాటు ఎయిమ్స్, జిప్‌మర్ సీట్లను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతో పాటు విదేశాల్లో 13 నగరాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..తెలంగాణ నుంచి 60 వేల మంది ఉన్నారు.