నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్‌లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య కోసం జాతీయస్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్లలో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్…