తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన సంచలంన కలిగించింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులకు చెందిన పిల్లలుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. రాజకీయ ప్రోద్భలం ఉండటంతోనే అధికారులు చర్యలు ఆలస్యం అవుతున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బాధితురాలి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంతో ఈ అంశం…