ఢిల్లీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రోజున రికార్డు స్థాయిలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని సెలయేరుల్లా మారిపోయాయి. భారీ వర్షానికి రోడ్లతో పాటుగా ఫ్లైఓవర్లకు కూడా వర్షం నీటితో నిడిపోయాయి. ఫ్లైఓవర్ల నుంచి నీరు కిందకు జలపాతంలా జారిపడుతున్నది. ఆ దృశ్యాలను చూసిన కొంతమంది నయగార జలపాతం ఢిల్లీకి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. వికాస్ పురి ప్రాంతంలోని ఫ్లైఓవర్ పై నుంచి వర్షం నీరు కిందకు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు…