మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దాదాపు కీలక నేతలు హతమయ్యారు. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో నెత్తురోడుతోంది. ఈ అంశంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదని పునరుద్ఘాటించారు. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని సూచించారు.
Gallantry Service Medals: 2025 రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ సేవలకు చెందిన మొత్తం 942 మంది సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డు లభించనున్నాయి. ఇందులో 95 మంది సైనికులకు శౌర్య పతకాలు, 101 మందికి విశిష్ట సేవలందించినందుకు రాష్ట్రపతి పతకం, 746 మందికి ప్రతిభ కనబర్చిన పతకాలు లభించాయి. 95 గ్యాలంట్రీ అవార్డులలో ఎక్కువ భాగం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరించిన సైనికులకు ఇవ్వబడ్డాయి. ఇందులో నక్సలైట్ల ప్రాంతానికి చెందిన 28…