సంప్రదాయ నృత్యం ప్రధానాంశంగా తెలుగులో వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పాలి. అందులో ఎక్కువ సినిమాలను కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించడం విశేషం. మళ్ళీ ఇంతకాలానికి ఆ లోటును తీర్చుతూ ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు తానే నటించి, ‘నాట్యం’ చిత్రాన్ని నిర్మించారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది. నాట్యం అనే గ్రామానికి చెందిన కథ ఇది! కాదంబరి అనే నర్తకి జీవనగాథ ఇది!! భారతీయ నృత్యాన్ని సజీవంగా ఉంచడం…