సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభలతీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు. దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ జగ్గన్నతోటలో, జరిగే ప్రభలతీర్థానికి దేశ స్థాయిలో ప్రత్యేకగుర్తింపు ఉంది.