PM Modi: దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 30, 31 తేదీల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ 30న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన కేవడియాలో ఉంటారు. ఇక్కడ జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రూ.284 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌లు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం…