మన ధర్మవరం చేనేత పట్టు చీరకు జాతీయ గుర్తింపు లభించింది.. దీనికి సంబంధించిన "ఒక జిల్లా ఒక ఉత్పత్తి" (ODOP – One District One Product)- 2024 అవార్డును ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు అందుకున్నారు మంత్రి సవిత, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కారు ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలుకు నాలుగు గ్రామాలు ఎంపిక కావడం విశేషం.