రైతన్న దేశానికి వెన్నుముక అన్న మాట చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం కూడా. అయితే దేశానికి వెన్నుముకలాంటి రైతన్న వెన్నులో వణుకుపుట్టించే విధంగా రాజకీయ పార్టీలు వాటి లబ్దికోసం రాక్షస క్రీడ ఆడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఆడే రాజకీయ రాక్షస క్రీడలో రైతన్నను పావుగా మారుతున్నాడు. మా ప్రభుత్వంలో రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతాం.. నకిలీ విత్తనాలు, ఎరువులును ఆరికడతాం.. పంటకు మద్దతు ధర ఇస్తామంటూ…