జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని, మన ఊరు – మన బడి ని సమర్థవంతంగా అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్ చేసింది. దేశంలో విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, రాష్ట్రాల హక్కులు హరించి విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచేది, లౌకిక తత్వానికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్రంలో అమలు జరపకుండా తిరస్కరించాలి.…
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జాతీయ విద్యావిధానం అమలుపై ఎమ్మెల్సీల అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, అమలవుతున్న పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభినందించినట్టుగా తెలుస్తోంది.. ఇక, జాతీయ విద్యావిధానం అమలుపై పలు సలహాలు సూచనలు చేశారు టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈ సమావేశంలో శాసన మండలి ప్రొటెమ్ ఛైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.…