పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. జియో న్యూస్ నివేదిక ప్రకారం.. మే 9న జరిగిన హింసకు సంబంధించిన ఎనిమిది కేసుల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో దేశవ్యాప్త నిరసనలు, ప్రభుత్వ, సైనిక సంస్థలపై దాడుల నేపథ్యంలో ఖాన్‌పై నమోదైన అనేక కేసుల విచారణ సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది. పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి యాహ్యా అఫ్రిది నేతృత్వంలోని…
ఫ్రాన్స్‌లో మితవాద, అతివాద చట్ట సభ్యలు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్, ఆయన మంత్రివర్గంపై ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి మిచెల్ బార్నియర్ ప్రభుత్వం ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో విశ్వాస ఓటింగ్‌లో ఓడిపోయింది.
పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ కుమార్తె ఆసీఫా భుట్టో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేశారు. మార్చి 29న షహీద్ బెనజీరాబాద్ నుంచి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అవిశ్వాస తీర్మానంపై పోరాటం చేస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులతో కలసి ముగ్గురు దొంగలు పనిచేస్తున్నారని మండిపడ్డారు.. కొన్ని విదేశాల నుంచి మాకు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు.. విదేశీ శక్తులు కుట్ర చేస్తుంటే.. దేశం లోపల వారికి సహకరించే శత్రువులు కూడా ఉన్నారని, ఇద్దరు కీలక మిత్రపక్షాలు ఫిరాయించిన తర్వాత…