సీనియర్ నటుడు సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి , హీరో ఆది సాయి కుమార్ తదితర సినీ, రాజకీయ…