Jio 5G: రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ఇవాళ రాజస్థాన్‌లో జియో 5జీ బీటా సర్వీసులను ప్రారంభించారు. రాజ్‌సమంద్‌లోని నాథద్వారాలో ఉన్న ప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబానీలకు ఈ దేవుడి పైన అపార నమ్మకం ఉంది. శ్రీనాథ్‌జీని తమ కుటుంబ దైవంగా కొలుస్తారు. గతంలో రిలయెన్స్ జియో 4జీ సర్వీసులను సైతం ఇక్కడే ప్రారంభించటం విశేషం.