హిజ్బుల్లా చీఫ్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హత్యకు గురైన తర్వాత ఇరాక్‌లో 100 మందికి పైగా నవజాత శిశువులకు 'నస్రల్లా' అని పేరు పెట్టారు. నస్రల్లా మరణం మధ్యప్రాచ్యంలో ప్రకంపనలు సృష్టించగా, మరోవైపు ఆయన పేరుకు ప్రజాదరణ వేగంగా పెరిగింది. నస్రల్లా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం, ప్రతిఘటనకు చిహ్నంగా పరిగణించబడ్డాడు. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆయన పేరు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.