Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరగింది. దళిత, వెనకబడిన తరగతులకు చెందిన ఇద్దరు యువకులను తప్పుడు ఆరోపణల్లో ఇరికించి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. తప్పుడు లైంగిక ఆరోపణ మోపి దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మలం తినిపించి జుగుప్సాకరంగా వ్యవహరించారు.
Madhyapradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైట్ వింగ్ గ్రూప్ వివాదాస్పద ప్రకటన చేసింది. ముస్లిం మహిళతో పారిపోయిన హిందూ యువకులకు రివార్డ్ ప్రకటించింది. రూ. 11,000లను బహుమతిగి ఇస్తామని చెప్పింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మతాంతర వివాహాలను నిరోధించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం మత స్వేచ్ఛ చట్టం 2021 ఉన్నప్పటికీ.. హిందూ ధర్మ సేన అనే సంస్థ ఈ ప్రకటన చేసింది. హిందూ ధర్మ సేన అధ్యక్షుడు యోగేష్ అగర్వాల్ ఈ ప్రకటన చేశాడు.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పఠాన్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రం 'పఠాన్' నుంచి కొత్త పాట 'బేషరమ్ రంగ్' తాజా వివాదానికి దారితీసింది.
మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ కాల్పులు జరిగాయి. ఈ ముగ్గురి మావోలపై రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ…