కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు సమయం దొరికినప్పుడల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపైనా, ఆర్ఎస్ఎస్ పైనా నిప్పులు చెరుగుతుంటారు. వారి మతరాజకీయాలపై విమర్శలు చేస్తుంటారు. అయితే, సడెన్‌గా దిగ్విజయ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపైనా, ఆర్ఎస్ఎస్‌పైనా ప్రశంసలు కురిపించారు. గతంలో వారు చేసిన సాయం గురించి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్ల క్రితం తాము నర్మదా పరిక్రమ యాత్రను చేస్తున్న సమయంలో అమిత్ షా, ఆర్ఎస్ఎస్‌లు గొప్ప సాయం చేశారని…