Sangareddy BJP Leaders : ఆ పార్టీ నేతల సంగతేంటి..? చొక్కాలు ఎందుకు చింపుకుంటున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ పార్టీ ఉన్నదే అంతంత. నేతల మధ్య కుమ్ములాటలు మాత్రం ఎక్కువే. ఫ్లెక్సీల్లో ఫొటో లేదని ఒకరు.. పార్టీ జెండా ఎగరేసే విషయంలో మరొకరు గల్లా పట్టుకుంటారు.. చొక్కలు చించుకుంటారు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టుది మరోదారి అన్నట్టు ఉందట నేతల తీరు.
సంగారెడ్డి బీజేపీలో వర్గపోరు గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిదన్నది పార్టీ నేతల మాట. ఎన్నికల్లో సత్తా చాటలేరు కానీ.. పార్టీలోని ఇతర నేతలపై పైచెయ్యి సాధించేందుకు మాత్రం ఉడుంపట్టే పడతారనే టాక్ ఉంది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీజేపీ పరిస్థితి దిగజారుతున్నా స్థానిక నాయకులకు ఎలాంటి ఫికర్ లేదనే అభిప్రాయం రాష్ట్ర నేతల్లోనే ఉందట. 2014లో బీజేపీకి 18వేల ఓట్లు వస్తే.. 2018 ఎలక్షన్లు వచ్చే సరికి 6వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు కమలనాథులు. ఈ గణాంకాలతో లోకల్ లీడర్స్‌కు ఎలాంటి చీకు చింత లేదని.. కలవరమంతా పైవాళ్లకే అని ఇక్కడి బీజేపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది.
Also Read
సంగారెడ్డి బీజేపీ ఇంఛార్జ్‌గా రాజేశ్వరరావు దేశ్‌పాండే ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. వీరిద్దరికీ అస్సలు పడటం లేదు. ఇటీవలే దయాకర్‌రెడ్డి అనే మరో నేత స్పీడ్ పెంచారట. కొత్త వ్యక్తి రాక వెనక జిల్లా అధ్యక్షుడి కుట్ర ఉందనేది ఇంఛార్జ్ అనుమానం. ఈ సందేహాలు రోజు రోజుకీ బలపడుతున్నాయే తప్ప.. సమస్య తీవ్రతను పట్టించుకుని.. పరిష్కరించిన రాష్ట్ర నేతలే లేరట. చివరకు రాష్ట్ర నేతలు భయపడిందే జరిగింది. ప్రజాగోస-బీజేపీ భరోసాయాత్ర సాక్షిగా రోడ్డెక్కి ఘర్షణ పడ్డాయి రెండు వర్గాలు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సమక్షంలోనే గల్లాలు పట్టుకున్నారు నేతలు.
సదాశివపేటలోని మద్దికుంటలో బీజేపీ బైక్ ర్యాలీ నడుస్తుండగా ఇంచార్జ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలలో తమ నేత ఫొటో లేదని వాదులాడుకున్నారు కూడా. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారి.. ఒకరినొకరు తోసుకున్నారు. చొక్కాలు చిరిగిపోయాయి. అరిచి గీ పెట్టినా.. ఎవరూ తన మాట వినకపోవడంతో రాంచంద్రరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత రోజు జరిగిన బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలోనూ రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. సంగారెడ్డిలో బీజేపీ బలోపేతానికి ఫోకస్ పెట్టకుండా.. ఈ తన్నులాటలేంటో కమలదళానికి అర్ధం కావడం లేదట.
సంగారెడ్డిలో గలాటా చేస్తున్న నేతలకు రాష్ట్రస్థాయిలో గట్టి లాబీయింగే ఉందట. హైదరాబాద్ నుంచి ఉన్న ఆశీసుల కారణంగానే ఎవరూ వెనక్కి తగ్గడం లేదనే చర్చ సాగుతోంది. ఒకవైపు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని.. పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ తెలంగాణ సారథి పాదయాత్ర చేస్తుంటే.. ఇక్కడి నేతలు మాత్రం ఆధిపత్యపోరాటానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇక్కడి పరిణామాలతో విసుగుచెందిన కేడర్.. కార్యక్రమాలకు రావడమే మానేసిందట. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న నియోజకవర్గం కావడంతో సంగారెడ్డి బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర నేతలు కలవర పడుతున్నారట. ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ వాళ్లు ఎంట్రీ ఇస్తే.. ఎవరికి సర్ది చెబుతారు? మాట వినని వారిపై చర్యలు తీసుకుంటారా? అనే సందేహాలు ఉన్నాయట.
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!