నిన్న ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.