కీలక సూచనలు చేశారు మంత్రి నారాయణ.. ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై పలు సూచనలు చేశారు నారాయణ .. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని కీలక అంశాలను పంచుకున్నారు.. అంతేకాదు.. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడించారు.