ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ తండ్రి నారాయణ్ దాస్ నారంగ్ ఇటీవల పరమపదించారు. ఆరంభం నుంచి చిత్రపరిశ్రమతో మమేకమై సాగిన తండ్రి మృతి సునీల్ కి ఆశనిపాతమే. ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడుగా కూడా చేసిన నారాయణదాస్ అడుగుజాడలలోనే అటు పంపిణీ రంగంలో, ప్రదర్శనరంగంలో తనదైన ముద్రవేసి ఇప్పుడు నిర్మాణంలో కూడా అడుగు పెట్టాడు సునీల్. తండ్రి దూరమైన ఖేదంలో ఉన్న సునీల్ కి మోదాన్ని కలిగించింది కుమార్తె జాన్వీ నారంగ్. లండన్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయంలో బిజినెస్…
నాగార్జునతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి తో కలసి నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నాగార్జున టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ నెల 9న రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేస్తూ ‘ఘోస్ట్’ ఇంట్రో పరిచయ తేదీని ప్రకటించారు.…
ప్రస్తుత తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఏషియన్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ అధినేత, గ్లోబల్ సినిమాస్ ఛైర్మన్, నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్ నారాయణదాస్ నారంగ్ ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన లేరన్న విషయం తెలిసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, శివకార్తికేయన్ వంటి హీరోలు నారాయణదాస్ నారంగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ట్వీట్లు చేశారు. ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే…
యంగ్ హీరో సుధీర్ బాబు చివరగా “వి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అతను “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నెక్స్ట్ ‘సమ్మోహనం’ దర్శకుడితో రెండవ సారి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు. ఇలా వరుస చిత్రాలతో ఫుల్ జోష్ లో ఉన్న సుధీర్ బాబు తాజాగా ప్రకటించిన చిత్రానికి ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్…
టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన తరువాత ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఉండబోతోందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయమై ధనుష్ ఆసక్తికరంగా స్పందించారు. “నేను ఆరాధించే దర్శకులలో ఒకరు శేఖర్ కమ్ములతో కలిసి పని చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లతో చేతులు కలపడానికి కూడా సంతోషిస్తున్నాను. వి.ఎస్.వి.సి.ఎల్.ఎల్.పి. బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ త్రిభాషా చిత్రం…