నారద కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో మమతా బెనర్జీ నుంచి రికార్డ్ అఫిడవిట్ తీసుకునేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ మమతా బెనర్జీ, బెంగాల్ ప్రభుత్వం, న్యాయశాఖ మంత్రి హైకోర్టులో తాజా అఫిడవిట్లు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. దీనికి ముందు, నారద స్కామ్‌లో తమ స్టేట్‌మెంట్‌ను…