ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి నారా లోకేష్.. జగన్ గారు మీ కపటత్వానికి నాకు నవ్వు వస్తోందన్న ఆయన.. "నాకు కాలేజీ లైఫ్ ఉంది.. మీకు జైలు జీవితం ఉంది".. "నాకు క్లాస్‌మెట్స్ ఉన్నారు... మీకు జైలుమెట్లు ఉన్నారు.." అర్థమైందా రాజా? అంటూ గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ట్యాగ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.
టీడీపీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేశ్ భావోద్వేగ పోస్టు చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీను.. తనకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నానని, మీ అన్నగా కుటుంబానికి అండగా ఉంటూ…
రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిందన్నారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ తన ఎక్స్ ద్వారా స్పందించారు. ‘కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి…