ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. సాయంత్రం హస్తినకు చేరుకున్నారు మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్.. ఇక, సాయంత్రం 7.30 గంటల తర్వాత ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు.. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకే ఢిల్లీకి వచ్చారు లోకేష్..