అందగత్తె ఆటకు వందనాలు అంటారు కానీ, అసలు అందగత్తె నోటి నుండి జారే ప్రతిమాటకు సాహో అంటూ సాగిలపడేవారు ఉంటారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్న రాజస్థాన్ ముద్దుగుమ్మ నందినీ గుప్తకు అప్పుడే బాలీవుడ్ ఎర్రతివాచీ పరిచేస్తోంది. మణిపూర్ లో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2023’ ఈవెంట్ లో ఎంతోమంది సినీప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గతంలో ఈ ఈవెంట్ లో విన్నర్స్ గానూ, రన్నర్స్ గానూ నిలచిన భామలు సైతం…