Off The Record: దేవినేని ఉమామహేశ్వరరావు. టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన నాయకుడు. ఇప్పుడా చక్రం జంగుపట్టి జామైపోయి… గ్రీస్‌తో రిపేర్ చేసి తిప్పుదామన్నా తిరగడం లేదట. ప్రస్తుతం ఉమా గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నట్టు చెప్పుకుంటున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, టిడిపి ప్రభుత్వ హయాంలో ఐదేళ్ళు జిల్లాలో ఏక ఛత్రాధిపత్యం నెరిపిన నాయకుడి గురించి ప్రస్తుతం మాట్లాడుకునేవాళ్ళే లేకుండా పోయారు. ఒకరకంగా…