గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 1200 మంది నాటక రంగ కళాకారులు హాజరయ్యారు. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే నాటక రంగం మళ్ళీ పునర్జీవం పోసుకుంటుందని, నాటకాలు ఆడుకునేందుకు ఓపెన్ ఆడిటోరియాలు నిర్మించాలని కళా పరిషత్ నిర్వాహకులు కోరుతున్నారు.