నందమూరి తారకరత్న మరణవార్త రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలని కలచివేస్తుంది. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, తారకరత్న ఎంతో మంచి వాడు, అతని మరణం బాధాకరం అని మాట్లాడుతున్నారు. ఇంతమంచి వ్యక్తి మరణిస్తే, ప్రతి ఒక్కరినీ అతని మరణం బాధిస్తూ ఉంటే తారకరత్న తల్లిదండ్రులు మాత్రం మృతదేహాన్ని చూసేందుకు మోకిలకి కూడా రాలేదు. బాలయ్యనే చిన్న తండ్రి హోదాలో నిలబడి తారకరత్న అంత్యక్రియ కార్యక్రమాలని చూసుకుంటున్నాడు. అభిమానుల సందర్శనార్ధం తారకరత్న…
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరపున స్టార్ ప్లేయర్, మంచి ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ అయిన నందమూరి తారకరత్న మరణించడంతో, నివాళులు అర్పించడానికి ఫిల్మ్ ఛాంబర్ వచ్చిన దగ్గుబాటి వెంకటేష్, తారకరత్నతో తనకి ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. “తారకరత్న అందరితో చాలా ప్రేమగా ఉండే వాడు, అతన్ని మేము మిస్ అవుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. సెలబ్రిటీ క్రికెట్ సమయంలో తారకరత్నతో మంచి అనుభందం ఉండేది” అని వెంకటేష్ మాట్లాడారు.
39 ఏళ్లకే తుదిశ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీనియర్ నటుడు బెనర్జీ, తారకరత్నతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ… “అంత మంచి నటుడు ఇలా చిన్న వయసులోనే మరణించడం భాధాకరం. ఆ భగవంతుడు తారకరత్నకి చాలా అన్యాయం చేశాడు. ఇటివలే 9 అవర్స్ వెబ్ సీరీస్ మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ఆ సమయంలో తారకరత్న బాబాయ్, బాబాయ్ అంటూ ప్రేమగా మాట్లాడే వాడు. నాన్న, నువ్వు మా మనసులో ఎప్పటికీ ఉంటావు” అని…
నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టారు. కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిన తారకరత్నని హాస్పిటల్ లో చేర్చినప్పటి నుంచి బాలయ్య అన్నీ తానై చూసుకుంటున్నాడు. హాస్పిటల్ దగ్గర ఉండే తారకరత్న ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, నిరంతరం అక్కడే ఉన్నాడు బాలయ్య. 23 రోజుల పోరాటం తర్వాత మరణించిన తారకరత్న ఆఖరి కార్యక్రమాలని కూడా బాలయ్య దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ ని తారకరత్న భౌతికకాయాన్ని…