(సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ జయంతి) తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నందమూరి హరికృష్ణ నిలిచారు. మహానటుడు నటరత్న యన్టీఆర్ తన తనయుల్లో మూడవవాడైన హరికృష్ణను బాలనటునిగా ‘శ్రీకృష్ణావతారం’లోనే పరిచయం చేశారు. అందులో బాలకృష్ణునిగా హరికృష్ణ ముద్దుగా మురిపించారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించినా, ‘డ్రైవర్ రాముడు’తో నిర్మాతగా మారారు హరికృష్ణ. అప్పటి నుంచీ చిత్ర నిర్మాణంపైనే దృష్టిని కేంద్రీకరించిన హరికృష్ణ దాదాపు 21 సంవత్సరాలకు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. అనూహ్యంగా కొన్ని సినిమాల్లో…