నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ కేబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అక్కినేని నాగేశ్వర రావు 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ భూములు పొందారు. స్టూడియో 1976లో ప్రారంభించబడింది. దాదాపు అదే సమయంలో, ఎన్టీఆర్ RTC X రోడ్స్…