ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా పోలీసులు ప్రకటించనున్నారు. పలుమార్లు విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్నారు. ప్రభకర్ రావు ను ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు మార్గం సుగమం అయ్యింది. హైదరాబాద్ పోలీసుల పిటిషన్ కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. కాగా జనవరిలోనే పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. Also Read:Gold Rates: ఒక్కరోజులోనే…
Duddilla Sridhar Babu : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎదుర్కొన్న కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టులో కొట్టేసింది. ఈ కేసు 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదు అయింది. కోర్టు తాజా తీర్పుతో న్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “2017లో BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతుల భూములు బలవంతంగా లాక్కొంటుందని నిరసనగా పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లాం. అప్పట్లో మేము 12మందిపై అక్రమంగా నాన్-బెయిలబుల్…
CM Revanth Reddy : గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పై చేసిన వ్యాఖ్యలపై, ఆయన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో, బీజేపీ అధికారం చేపట్టినప్పుడు రిజర్వేషన్లను తొలగిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా, పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు ఆడియో, వీడియో క్లిప్స్ సమర్పించారు. Sri Chaitanya : తెలంగాణ ఇంటర్మీడియేట్…
POCSO : నాంపల్లి లోని పోక్సో (POCSO) కోర్టు శుక్రవారం సంచలన తీర్పుని వెలువరించింది. 2023లో రాజ్‌భవన్ మక్త ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌కు కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసు తీర్పు ప్రకటనతో బాధిత కుటుంబానికి న్యాయం లభించిందన్న భావన నెలకొంది. వివరాల ప్రకారం, 2023లో శ్రీనివాస్ అనే వ్యక్తి మైనర్ బాలికను సెల్‌ఫోన్ ఇస్తానని మాయ మాటలతో మభ్యపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం…
మరో మూడు కేసుల్లో రాజా సింగ్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు బీజేపీ శాసనసభ్యుడు టి. రాజా సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో శనివారం విచారణ జరిగింది. ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో దగ్గుబాటి కుటుంబానికి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు…
నాంపల్లి కోర్టుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి చేరుకున్నారు. సంధ్య థియోటర్ ఘటనలో నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మళ్లీ కోర్టుకు చేరుకున్న ఐకాన్ స్టార్ రెగ్యులర్ బెయిల్‌కి సంబంధించి ష్యూరిటీలు సమర్పించారు. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం చేసి.. ష్యూరిటీలు సమర్పించారు. కోర్టు తీర్పు ప్రకారం.. యాభై వేల రూపాయల డిపాజిట్ తో పాటు రెండు పూచీకత్తులను సమర్పించారు.
Sandhya Theatre Incident : పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే.