కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో నా సోదరుడు ప్రసన్నకుమార్ రెడ్డికి సీటు ఇవ్వొద్దు అంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాజేంద్రకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో కోవూరులో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.