ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో నల్లమల ఫారెస్ట్‌లో భక్తులు తప్పిపోవడం కలకలం సృష్టించింది.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలో శ్రీశైలం సమీపంలోని ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయానికి వెళ్తూ.. తప్పిపోయారు 15 మంది భక్తులు.. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి సురక్షితంగా రక్షించి అటవీప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు..
Indian Bison : తాజాగా నంద్యాల జిల్లా ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవిలో ఓ అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇలాంటి దున్నలు ఇదివరకు 150 సంవత్సరాల క్రితం కనపడ్డాయని.. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ అడవి దున్నలు నల్లమల్లలో కనిపించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని అధికారులు గుర్తించారు. 1870 లలో కనిపించిన ఈ అడవి దున్న దాదాపు 150 ఏళ్లు గడిచిన తర్వాత మళ్ళీ నల్లమల్ల…
తెలంగాణ అమరనాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేడు ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు నల్లమల అభయారణ్యంలోని సళేశ్వరం జాతర జరగనుంది.
ఈమధ్యకాలంలో అడవుల్లో పులులు రోడ్లమీదకు వచ్చేస్తున్నాయి. జనాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం సంచలనం రేపుతున్నాయి. కొంతమంది వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచారం చేస్తున్నాయనే వీడియోలు ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచరించినట్లుగా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేసారు. వీడియోలు ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.…