పైన పటారం..లోన లొటారం. ఆ జిల్లాలో జాతీయపార్టీ తీరు అలాగే ఉందట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని నాయకులు లెక్కలేస్తుంటే.. జిల్లా నేతలు మాత్రం రివర్స్‌లో వెళ్తున్నారట. కుమ్ములాటలతో కాలక్షేపం చేస్తు.. వర్గాలను పెంచిపోషిస్తూ కేడర్‌ను కలవర పెడుతున్నారట. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీలో ఎవరివారే యమునా తీరే..!ఉమ్మడి నల్లగొండ జిల్లా. కామ్రేడ్లు, కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఆయువు పట్టుగా ఉన్న ఈ జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఆధిపత్యం సాధించింది. అలాంటి జిల్లాలో పుంజుకుని.. రాష్ట్రంలో…