Zipline: నాగ్‌పూర్‌కు చెందిన ఒక కుటుంబానికి విహారయాత్ర విషాదంగా మారింది. నాగ్‌పూర్‌కి చెందిన ప్రఫుల్ల బిజ్వే కుటుంబం మనాలి టూర్‌కు వెళ్లింది. అయితే, వీరి కూతురు ప్రమాదవశాత్తు జిప్‌లైన్ బెల్ట్ తెగడంతో 30 అడుగుల లోయలో పడిపోయింది. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేద్ధామని వెళ్లిన వీరికి ఈ టూర్ పీడకలగా మారింది. ఈ ఘటన జూన్ 8న జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.