Naga Rahavu: కన్నడ చిత్రసీమలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడు విష్ణువర్ధన్. ఆయన అసలు పేరు సంపత్ కుమార్. 1971లో 'వంశవృక్ష' చిత్రంలో తొలిసారి కుమార్ పేరుతో తెరపై కనిపించారు విష్ణువర్ధన్. ప్రముఖ కన్నడ దర్శకులు పుట్టన్న కణగల్ ఆయన పేరును విష్ణువర్ధన్ గా మార్చి, 'నాగరహావు' చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు.