ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీకి ఎన్నికలు ముగిసినా ఇంకా ఉత్కంఠ తీరడంలేదు. దర్శి నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఆసక్తిగా మారుతోంది. ఇక్కడ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యతను కనబరిచిన టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంటుందా? టీడీపీ కౌన్సిలర్స్ లో చీలిక కు వైసీపీ ప్రయత్నం చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. చైర్మన్ ఎన్నిక జరగబోయే సోమవారం ఏం జరగబోతోంది? రెండుదఫాలుగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తాడిపత్రి, కొండపల్లి, దర్శిలో ఆధిక్యతను సాధించింది. దర్శిలో మొత్తం 20…