టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకానికి పంచ్ దూరంలో ఉంది ఇండియా.. ఇవాళ 69 కిలోల విభాగంలో జరిగిన బాక్సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్‌లో భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ సంచలనం సృష్టించింది.. జర్మన్ బాక్సర్ నడైన్ ఆప్టెజ్‌ను 3-2 తేడాతో ఓడించి.. క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.. ఇక, క్వార్టర్స్‌లో గెలిస్తే.. ఆమె కనీసం కాంస్య పతకం అందుకోనుంది.. ఇవాళ భారత్ నుంచి పోటీపడిన ఏకైక బాక్సర్ లవ్లీనా మాత్రమే కాగా.. విజయం సాధించి పతకంపై ఆశలు చిగురించేలా చేసిందామే..…