TDP Office: రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై నాడు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడిలో కీలక సమాచారం సేకరించాం అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మాజీ ఎంపీ నందిగం సురేష్, కస్టడీలో పోలీసులకు సహకరించారు. కొన్ని కీలక సమాచారాలు ఇచ్చారని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. నేరానికి కుట్ర ఎక్కడ జరిగిందో,…
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి తరలిస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది. పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించాలన్న తన ఆదేశాలను కొనసాగించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. అయితే.. హైదరాబాద్ మియాపూర్‌లో నందిగం…