ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని సందర్శించనున్నారు మోడీ.. ఇక, ఈ పర్యటనలో పాలసముద్రంలో ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఏర్పాటు కానుంది. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో…