టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా తనలోని గొప్ప మనసును చాటుకున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో శర్వానంద్ మాట్లాడుతూ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన విజయాన్ని అందించిన నిర్మాత అనిల్ సుంకరపై ప్రశంసలు కురిపించారు. ఒక నిర్మాతగా అనిల్ సుంకర తనకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని, అందుకే ఆయనతో చేసే…