కింగ్ నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో కలిసి “నా సామీ రంగ” సినిమా చేసాడు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోని ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో ఇతర సినిమా ఉన్నా కూడా నాగార్జున నా సామిరంగ సినిమాని రిలీజ్ రేస్ లో నిలబెట్టాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా నాగార్జున ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా కూడా తన సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టడానికి అసలు వెనుకాడలేదు.…
కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాతో రేపు ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. పండక్కి వస్తున్నాం హిట్ కొడుతున్నాం అని కాన్ఫిడెంట్ గా ఉన్న నాగార్జున… నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ తో అక్కినేని అభిమానుల్లో మంచి జోష్ తెచ్చాడు. ఇదే జోష్ లో రేపు థియేటర్స్ కి వెళ్లిపోవడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. రిలీజ్ ముందు రోజు కూడా ప్రమోషన్స్ చేస్తున్న నా సామిరంగ చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తోంది.…