అక్కినేని కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ… విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి షూటింగ్ జరుపుకుంటుంది. నాగార్జున 99వ సినిమాగా బయటకి రానున్న నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అవ్వడానికి జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకున్న నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ మంచి జోష్ లో సాగుతున్నాయి. ఇప్పటికే ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందే పిల్ల సాంగ్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అల్లరి నరేష్ ‘అంజిగాడు’ పాత్రకి సంబందించిన గ్లిమ్ప్స్, అనౌన్స్మెంట్ వీడియోలు నా సామిరంగ సినిమాపై హైప్ పెంచాయి. వీటన్నింటినీ మించి నా సామిరంగ టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
పర్ఫెక్ట్ పండగ సినిమాలా కనిపిస్తున్న నా సామిరంగ టాక్ బాగుంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లిపోవడం గ్యారెంటీ. లేటెస్ట్ గా నా సామిరంగ టైటిల్ సాంగ్ ని లాంచ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకి నా సామిరంగ టైటిల్ సాంగ్ రిలీజ్ అవ్వనుంది. ఈ సాంగ్ ప్రోమోని బయటకి వదిలారు. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు ఉన్న ఈ ప్రోమోలో మంచి జోష్ ఉంది. ఈ సాంగ్ దెబ్బకి థియేటర్స్ లో పూనకాలు రావడం పక్కా. ఇండియాకి ఆస్కార్ తెచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి వర్క్ చేసిన కీరవాణి, చంద్రబోస్… సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవలు కలిసి నా సామిరంగ టైటిల్ సాంగ్ ని మరింత స్పెషల్ గా మార్చబోతున్నారు.
ఈసారి సంక్రాంతి పండక్కి! నా సామిరంగ🌾🔥#NaaSaamiRanga King Size Mass Feast in theatres on January 14th, 2024💥
Title Song Promo – https://t.co/x5va5lDpdD
Full Song Today at 4:05PM🤩#NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthiKING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani… pic.twitter.com/j3kRa7NAqf
— Annapurna Studios (@AnnapurnaStdios) December 31, 2023