ప్రతి ఇయర్ సంక్రాంతిలాగే… ఈ ఇయర్ కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు రేస్ లోకి వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం… 13న సైంధవ్, 14న నా సామిరంగ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో హనుమాన్ సినిమాకి ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ సెట్ అయిపోయాయి. జనవరి 11 నుంచి హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ ప్రీమియర్స్ నుంచి టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అయితే హనుమాన్ సినిమా సంక్రాంతి రేస్ లో మొదటి హిట్ మూవీగా నిలుస్తుంది. ఆ తర్వాత 11 నైట్ నుంచి గుంటూరు కారం ఓవర్సీస్ షోస్ 12 ఎర్లీ మార్నింగ్ నుంచే గుంటూరు కారం షోస్ పడుతున్నాయి. ఈ మూవీపై హైప్ బాగుంది కాబట్టి టాక్ యావరేజ్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ కనిపించడం గ్యారెంటీ.
సైంధవ్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వెంకీ మామ నుంచి నాగార్జునకి షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ అనగానే వెంకటేష్ కి సపోర్ట్ ఇస్తారు అనే మాట ఉంది కానీ ఈసారి జనవరి 13న కన్నా 14న వచ్చే నా సామిరంగ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే అన్ని సినిమాలకి U/A సర్టిఫికేట్ ఉండడం, పండగ సీజన్ కావడం ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. ఇన్నో రోజులు ఈ సినిమాల్లో ఎదో హిట్ అవుతుంది అనే ప్రశ్న మూవీ లవర్స్ లో ఉండేది ఇప్పుడు ఈ ప్రశ్నని సమాధానం ఈ రోజు గడిస్తే ఒక్కొక్కటిగా బయటకి రానుంది.