పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీసీ సంఘం ఈ నెల 13, 14 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమంతో పాటు జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనుంది. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 13, 14వ తేదీల్లో నిర్వహిస్తున్నామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ పేర్కొన్నారు.