హైకోర్టుకు చేరింది కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం..తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడు చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. అయితే, దీనిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది హైకోర్టు.. నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించింది.