(అక్టోబర్ 17న ‘పవిత్ర బంధం’కు 25 ఏళ్ళు)తెలుగు చిత్రసీమలో ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసిన జంటల్లో వెంకటేశ్ – సౌందర్య జోడీనీ తప్పకుండా చేర్చాలి. వారిద్దరూ కలసి నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ బరిలో బంపర్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో ‘పవిత్రబంధం’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సి.వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కాంటాక్ట్ మ్యారేజ్’ అన్నది ప్రధానాంశం. 1996 అక్టోబర్ 17న దసరా కానుకగా విడుదలైన ‘పవిత్ర బంధం’ ఘనవిజయం సాధించింది.…