చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అస్సలు వదలడం లేదు. కొత్తగా రూపాంతరం చెంది ప్రజలపై దాడులు చేస్తూనే ఉంది. ఇక తాజాగా సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులు,ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ పాఠశాలలో ఏకంగా 520 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే… నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 43 మంది విద్యార్థులు,…