Assam: యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసే దిశగా అస్సాంలోని హిమంత బిశ్వ సర్మ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అస్సాం అసెంబ్లీ గురువారం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులుకు సంబంధించి పాత చట్టాన్ని తొలగించి, వివాహాలు విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది.